ADOLESCENCE: 'అడాల్సెన్స్' రికార్డు సృష్టిస్తోంది..17 రోజుల్లో 96.7 మిలియన్ వ్యూస్ 5 d ago

ఇటీవల నెట్ ఫ్లెక్స్ వేదికగా విడుదలైన 'అడాల్సెన్స్' రికార్డులు సృష్టిస్తోంది. స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చిన రోజు నుంచి ప్రశంసలు అందుకుంటోన్న ఈ సిరీస్ తాజాగా మరో రికార్డు సృష్టించింది. 'అడాల్సెన్స్' సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 17 రోజుల్లో 96.7 మిలియన్ వ్యూస్‌ను సాధించి 'స్ట్రేంజర్ థింగ్స్ 3' (94.8 ), 'బ్రిడ్జర్టన్ సీజన్ 2' (93.8 ) వంటి ప్రసిద్ధ సిరీస్‌లను మించిపోయింది. ఈ సిరీస్ 93 దేశాల్లో టాప్‌లో కొనసాగుతోంది. ఇంగ్లిష్ సిరీస్‌లలో మార్చి 24 నుండి 30 వరకు 30 మిలియన్ వ్యూస్‌ను పొందింది. ఇది మరికొన్ని రోజులలోనే టాప్ వన్ కి చేరుకొనే అవకాశం కనిపిస్తోంది.